BDK: అశ్వాపురంలో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన అశ్వాపురం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇవాళ సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టగూడెం గ్రామానికి చెందిన అక్కినపల్లి కిషోర్(39) ఈ నెల 26న మధ్యాహ్న సమయంలో తన ఇంటి నుంచి బైక్పై మణుగూరు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారు బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్లలో వెతుకినా ఆచూకీ లభించలేదన్నారు.