PDPL: రామగిరి ఏపీఏ డివిజన్ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్పీ)లో ‘పీ’ షిఫ్ట్‌ల విధుల్లో ఉన్న తోట రవి అనే సపోర్ట్ మెన్ 86 లెవెల్ వద్ద అస్వస్థతకు గురయ్యారు. తోటి కార్మికులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చి ఉపరితలంపైకి తరలించారు. అంబులెన్స్‌లో సెంటినరీ డిస్పెన్సరీకి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సింగరేణి ఆస్పత్రికి తరలించారు.