SRPT: కలెక్టరేట్ కార్యాలయం ముందు రిటైర్డ్ఉ ద్యోగుల బెనిఫిట్స్ సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం రిటైర్డ్ ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పొనుగోటి కోటయ్య మాట్లాడుతూ.. 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.