NLG: తిప్పర్తి మార్కెట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల తుఫాను వర్షాలకు కేంద్రంలోని ధాన్యం తడవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సెంటర్ ఇన్ఛార్జికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆమె ఆదేశించారు.