మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ రేపు థియేటర్లలో సందడి చేయనుంది. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ఈ సినిమా విజయంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే, అదే రోజున బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రభాస్-రాజమౌళి కాంబోలోని బ్లాక్బస్టర్ సినిమా ‘బాహుబలి ది ఎపిక్’ కూడా రేపే ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ అవుతోంది.