BDK: బూర్గంపాడు మండలం సారపాకలోని శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా మందిరంలో కార్తీక గురువారం సందర్భంగా ఒక్కరోజు సాయిబాబా దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించారు. దత్తత తీసుకున్న నాగేశ్వరరావు రోజా రాణి దంపతులు ఒక్కరోజు దత్తత 20 వేల రూపాయలతో తీసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.