NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని చిట్యాల పీఏసీఎస్ ఛైర్మెన్ సుంకరి మల్లేష్ గౌడ్ తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో చిట్యాలలోనే మల్లన్న గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ప్రతి గింజను కొంటామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.