SRCL: పోలీస్ అమరవీరుల త్యాగం మరువలేదని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో గురువారం పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులను ప్రజలు మరిచిపోవద్దన్నారు.