MNCL: జన్నారం మండలంలోని కలమడుగు, కవ్వాల్ గ్రామ శివారులో భారీ వర్షాలతో నేలకొరిగిన వరి పంటను మండల వ్యవసాయ అధికారి సంగీత, ఏఈవోలు అక్రమ్, దివ్య పరిశీలించారు. గురువారం వారు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. రైతులు మోతాదుకు మించి ఎరువును వాడటంతో వరి ఎత్తుగా పెరిగి నేల కొరికిందని తెలిపారు. ఒకటిన్నర యూరియా బస్తాను రైతులు ఎకరానికి వాడాలన్నారు.