MDCL: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నేడు ట్రాఫిక్ పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరులను స్మరిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరగవని ప్రజలు అవగాహన సైతం కల్పించారు. ఈ ప్రోగ్రాంలో ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.