శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడగలుగుతామని తెలిపారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలకు అభినందనలు తెలిపారు.