VZM : విజయనగరం శ్రీ పైడితల్లి ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 4వతేదిన మహాన్నదానం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 10 వేల నుంచి 12 వేల మందికి అన్న ప్రసాదాలు అందజేస్తారన్నారు. మూడులాంతర్లు సమీపంలోని చదురుగుడి ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.