NGKL: భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి (డిండి సమీపంలో) మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వరదలకు రోడ్డు కోతకు గురికావడంతో మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇంజినీరింగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం రాకపోకలు యథావిధిగా సాగనున్నాయి.