SRPT: దేశం కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఇందిరమ్మ హాయంలోనే పేదలకు ఇళ్లు అందాయన్నారు. ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిందన్నారు.