ASR: కాకరపాడు హైవే నుంచి కొయ్యూరుకు వెళ్లే అప్రోచ్ రోడ్డు వెడల్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అప్రోచ్ రోడ్డు తగిన వెడల్పు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శనివారం రాత్రి కాకరపాడు హైవే నుంచి కొయ్యూరుకు వెళుతున్న లారీ మలుపు తిరగలేక ఇరుక్కుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అప్రోచ్ రోడ్డు వెడల్పు చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు.