JN: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని దేవరుప్పుల మండల కేంద్రంలో ప్రధానచౌరస్తా ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సధానందం, కానిస్టేబుల్ యాకేష్, పోలీస్ సిబ్బంది, తదితరులున్నారు.