SKLM: కొత్తూరు మండలం కడుమ సచివాలయంలో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న మాలతీబాయి గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎంతో చురుకుగా పనిచేసేవారని తోటి సచివాలయ సిబ్బంది తెలిపారు.