JN: తుఫాన్ ప్రభావంతో పాలకుర్తి మండలం నుంచి తొర్రూరు వైపునకు వెళ్లే రహదారిపై దర్ధపల్లి వద్ద నీరు ప్రవహిస్తూ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.