సత్యసాయి: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళా కబడ్డీ టోర్నీకి పుట్టపర్తి మండలం చివరపల్లిలోని మంగళకర డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని పూజిత ఎంపికైంది. తమిళనాడులోని శీలంలో నవంబర్ 2న జరిగే ఈ టోర్నమెంట్లో ఆమె ఎస్కే యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొంటుందని కళాశాల మేనేజర్ డైరెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. పూజిత ఎంపికపై కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.