W.G: నరసాపురం మండలం లిఖితపూడి గ్రామానికి చెందిన దివ్యాంగుడు పెచ్చేట్టి సుబ్బారావు (75) బుధవారం ముఖం కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. ఎంత ఎదురు చూసిన సుబ్బారావు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలించగా, సాయంత్రం చెరువులో సుబ్బారావు మృతదేహం లభ్యమైంది.