మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ విజయయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీ ప్రైడ్ కింద ఆరుగురికి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.