ASR: జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడానికి పక్కా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి పాడేరు కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్లూరి జిల్లా నుంచి గంజాయి రవాణా చేయడం చాలా కష్టం అనే పరిస్థితిని తీసుకురావాలన్నారు. జిల్లాలో వన్నరబుల్ గ్రామాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు.