KNR: సైదాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని, సైదాపూర్ – హుజూరాబాద్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలన్నారు.