KNR: శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో తల్లికొడుకులపై గొడ్డలితో దాడి జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం రాజు, గడ్డం మల్లవ్వపై చొప్పదండి మండలం మంగళపల్లికి చెందిన వారి బంధువులు హత్యా ప్రయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలించారు.