NLR: మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో గురువారం జరిగిన వేలంలో 1018 బేళ్లు అమ్మకానికి రాగా, వ్యాపారులు 530 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. 488 బేళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. గరిష్ఠ ధర కిలో రూ. 335, కనిష్ఠ ధర కిలో రూ. 60గా నమోదైంది. ఈ పరిణామంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.