VSP: పద్మనాభం మండలం తునిపొలంలోని గెడ్డలో నిన్న ధనుశ్రీ (13) అనే బాలిక గల్లంతైన విషయం విధితమే. తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయింది. బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇవాళ ఉదయం మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కుమార్తె మృతదేహం వద్ద తల్లి రోదిన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.