NZB: కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతిని నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు.