ADB: రోడ్డు భద్రతా నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కానీ జిల్లాలో ఇంకా చాలా మంది వాహనదారులు ఈ నిబంధనను నిర్లక్ష్యం చేస్తున్నారు. పోలీసులు తరచుగా జరిమానాలు విధిస్తూ,హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నా కూడా, కొందరు హెల్మెట్‌ను చేతిలో లేదా బండికి తగిలించుకుని వెళ్లడం సాధారణంగా మారింది.