వీధి కుక్కల కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలన్న ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ‘అఫిడవిట్ దాఖలు చేయమంటే.. నిద్రపోతున్నారా?’ అంటూ అసహనం వ్యక్తం చేస్తూ.. కోర్టు తీర్పును ప్రభుత్వాలు గౌరవించట్లేలేదని మండిపడింది. TG, బెంగాల్ రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల CSలు నవంబర్ 3న వ్యక్తిగతంగా హాజరుకావాలని SC మరోసారి స్పష్టం చేసింది.