AKP: కోటవురట్ల మండలం జల్లూరులో శుక్రవారం అధికారులు మురికి కాలువలను శుభ్రం చేయించి బ్లీచింగ్ వేయించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. మంచినీటి ట్యాంకులను పరిశీలించి క్లోరినేషన్ చేయించాలన్నారు. పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.