ADB: జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలో అధికారులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.