GDWL: గద్వాల జిల్లాలోని నడిగడ్డ ఇలవేల్పుగా పేరుగాంచిన జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారు భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి, పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో అందంగా అలంకరిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కొబ్బరికాయలు, మహా నివేదనలు సమర్పిస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు.