TG: తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 10వేలు ఇస్తే సరిపోదని కల్వకుంట్ల కవిత అన్నారు. ఒక్కో ఎకరానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.