GNTR: తెనాలిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. మారిస్పేట-మద్రాసు గేటు మధ్య రైలు పట్టాలు దాటుతున్న సుమారు 30-35 ఏళ్ల గుర్తుతెలియని యువకుడిని మిలటరీ స్పెషల్ ట్రైన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.