JGL: ఉన్న ఊర్లో ఉపాధి కరువై బ్రతుకుదెరువు నిమిత్తం గల్ఫ్‌కి వెళ్ళిన వలస జీవి అక్కడ గుండెపోటుతో మృతి చెందాడు. ధర్మపురి మండలం బూరుగుపల్లికి చెందిన ఎర్రం రాజ్ కుమార్ దుబాయిలో గుండెపోటుతో మృతి చెందాడు. అక్కడ గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ఆధ్వర్యంలో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.