SKLM: జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పీ. జగదీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పోలీస్ శాలరీ ప్యాకేజీ పరిధిలో రూ.1 కోటి నష్టపరిహారం మంజూరైంది. గురువారం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి చెక్కును కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు అందజేశారు. జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.