ప్రకాశం: చీమకుర్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ రామకృష్ణ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశానికి వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది హాజరు కావాలన్నారు. అధికారులు తమ నివేదికలతో సమావేశానికి రావాలన్నారు.