GDWL: గట్టు మండలం తప్పెట్లమొర్సు శివారులో గుట్టుగా జరుగుతున్న కోడి పందాల స్థావరంపై గురువారం ఎస్సై కేటిమల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10,900 నగదు, 6 కోళ్లు, 9 సెల్ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.