SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు గురువారం రాత్రి తన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎచ్చెర్ల మండలం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, పూర్తి చేయాల్సిన పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.