TG: రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఇందులో 2.80 లక్షల ఎకరాల్లో వరి, 1.50 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మిరప, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు కూడా వేల ఎకరాల్లో నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.