ప్రకాశం: కనిగిరి మండలం చాకిరాల రైతు భరోసా కేంద్రం వద్ద శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 25 శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి రైతులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకులు జైనులాబ్దిన్ స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.