ప్రకాశం: తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కుబుగ్గ నరసింహారెడ్డి అన్నారు. గురువారం పామూరు మండలంలో ఆయన పర్యటించారు. ఈ మేరకు మండలంలోని దోమగుంట గ్రామంలో వరద బాధితులకు ప్రభుత్వం అందజేసిన నిత్యవసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ వాసుదేవరావు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.