VZM: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అరకు-యలహంక మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్(08551) రైలు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం కే.పవన్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 13, 23 తేదిలలో అరకులో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి కొత్తవలస 2.23కు చేరుతుందన్నారు. ఈ రైలు దువ్వాడ, గుంటూరు, శ్రీ సత్యసాయి మీదుగా యలహంక చేరుతుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగించుకోవాలని కోరారు.