TG: రాష్ట్రానికి ఎంఐఎం (MIM) పార్టీ ఒక చీడలా పట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 39 స్లాటర్ హౌస్లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ స్లాటర్ హౌస్ల వెనుక ఎంఐఎం నేతలే ఉన్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.