జియో తమ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. జియో టెలికాం యూజర్లకు 18 నెలల పాటు గూగుల్ AI ‘జెమినీ ప్రో’ ప్లాన్ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. దీని విలువ రూ.35,100 ఉంటుందని తెలిపింది. ఇవాళ్టి నుంచే ఈ ఫ్రీ ప్లాన్ ప్రారంభమవుతుంది. తొలుత 18 నుంచి 25 ఏళ్ల వయసున్న కస్టమర్లకు అందించనుంది. అన్లిమిటెడ్ 5జీ ప్లాన్ కలిగిన వారిని అర్హులుగా పేర్కొంది.