GDWL: అలంపూర్ జోగుళాంబ ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై, దళితుల పట్ల వివక్ష చూపుతున్న ఈవోపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఎండోన్మెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ డైరెక్టర్ నాగశిరోమణి, ఆర్టీఏ సభ్యుడు పల్లి సతీష్ రెడ్డి పాల్గొన్నారు.