BHNG: భారీ వర్షానికి బీబీనగర్ మండలం రుద్రవెళ్లి వద్ద బ్రిడ్జిపై నుంచి మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ వరద ఉద్ధృతిని కలెక్టర్ హనుమంతరావు గురువారం పరిశీలించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.