సత్యసాయి: హిందూపురం గ్రామీణ మండలం చౌళూరులో కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు తప్పుడు అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వర్షాల కారణంగా కల్లు అందుబాటులో లేక మూడు రోజులుగా తాగడం మానేసిన 9 మందికి విత్‌డ్రాయల్ లక్షణాలు కనిపించగా, వారు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది.