TG: కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్లనున్నారు. వరంగల్, హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అయితే ఇప్పుడే కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు.