NRML: వర్షాల ప్రభావంతో ముధోల్ నియోజకవర్గ రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావం కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంటల నష్టం అంచనాలు వేయాలన్నారు.